ఆర్ధిక సంస్కరణలు |
|
Article BY:Janardhan Prasad D V S
ఆర్ధిక సంస్కరణలు: ఈ వ్యాసము ఎకనమిక్ టైమ్స్ లో 9.5.13 తేదీన ఉత్తరరూపములో నేను వ్రాయడమయినది. ఆర్ బీ ఐ గవర్నర్ పాకిస్తాను వారు పటించే వడ్డీరహిత ద్రవ్య మారకములు ఆధునిక వ్యాపారసరళికి అనుగుణమయిన విధానము కాదని ఆయన చెప్పడముతో ప్రతిస్పందించి నేను ఈ ఉత్తరమును వ్రాయడమయినది. తెలుగు మిత్రుల అనుకూలార్ధము ఈ వ్యాసమునకు తెలుగు అనువాదము వ్రాస్తున్నాను.
మన దేశములో ఆర్ధిక విధాన సరళీకరణము షుమారు రెండు దశాబ్దాలక్రితము మొదలయినది. ఈ ఆర్ధిక సంస్కరణల ప్రక్రియవలన మన దేశము పురోగతి చెందుతుందని చెబుతూవస్తున్నారు. అయినప్పటికి మనపాలకులు ఇప్పటికీ విదేశీ సంస్థాగత పెట్టుబడులకోసరము ఎందుకు అర్రులుచాస్తున్నారు? మనకు గల విదేశీ అప్పులను డాలర్లలో చెల్లించాలి. మనకు డాలర్లు కావలంటే మనము మనదేశమునుంచి వస్తువులను ఎగుమతిచెయ్యాలి. మన పరిశ్రమలు గత ఇరవై సంవత్సరములుగా కుదేలయిపోయినవి. మరియు గత మూడు సంవత్సరములుగా పారిశ్రామిక రంగము ఎదుగుదల ప్రతికూలదిశలో నడుస్తుంది. మన దేశీయులు అమెరికాలోనూ గల్ఫ్ లోనూ ఉద్యోగాలు చేస్తూ ఇండియా పంపించే డాలర్లు సంవత్సరానికి షుమారు నాలుగు లక్షలకోట్లు ఉంటాయి. మనము దిగుమతిచేసుకునే క్రూడ్ ఆయిల్ బిల్లే 7,50,000 కోట్లు. అలాగే విదేశీ అప్పులకు వడ్డీలు తదితర చెల్లింపులు ఉంటాయి. రక్షణ పరికరాల దిగుమతులు ఉంటాయి. వీటన్నిటికోసం ప్రభుత్వము విదేశీ పెట్టుబడుల పేరును దేశ వనరులను సంస్థాగత పెట్టుబడుల రూపేణా అమ్మి ఆర్ధిక సంక్షోభమునుంచి తాత్కాలికంగా ఉపశమనమును పొందుతుంటుంది.
ప్రజల కొనుగోలు శక్తి తగిన స్థాయిలో ఉంచడానికిఅన్నట్లు అంచెలంచెలుగా బ్యాంకుల సి ఆర్ ఆర్ రేటును తగ్గిస్తూ సంవత్సరానికి షుమారు 45,000 నుంచి 70,000 కోట్ల్ సొమ్మును ఉద్పాదక రహిత రంగములకు ప్రభుత్వము జొప్పిస్తుంది. ఇది భారతీయులు విదేశీవస్తువులు కొనడానికే తప్ప ఉద్పాదక రంగానికి ఉపయోగము లేదు.
నిజానికి దేశ ఆర్ధిక పరిస్థితి తత్కాల పరిష్కారములతో సడుస్తుంది. మన దేశములోని జాతీయ పరిశ్రమలు ప్రధానంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అధిక వడ్డీలవలన కుదేలయి మూతపడుతూపోతున్నాయి. వడ్డీరేట్లు తగ్గితేగాని భారతీయ చిన్న మధ్యతరగతి పారిశ్రామిక ఉద్పాదక రంగము కోలుకోలేదు. పారిశ్రామిక రంగములో అభివృద్ధిలేకుండా దేశము ఏవిధముగా పురోగతి చెందుతుంది? ( ఎకనమిక్ టైమ్స్ లో 9.5.13 తేదీన జనార్ధన్ ప్రసాద్ వ్రాసిన వ్యాసమునకు తెలుగు అనువాదము.)

Click the following buttons to visit my other Websites:
నా ఇతర వెబ్ సైట్లు చూడడానికి ఈ క్రింది బటనులు నొక్కవలెను. |