ఐ ఎమ్ ఎఫ్, వరల్డ్ బ్యాంకు అప్పు |
Visit my You Tube channel:
|
Article BY:Janardhan Prasad D V S
ఈ మధ్య బీజేపీవారు తాము అధికారములోకి వచ్చిన తరువాత వరల్డ్ బ్యాంకు నుంచి ఇండియా ఒక్క రూపాయి అప్పుకూడా అప్పుచెయ్యలేదు అని డాంబికాలు పలుకుతున్నారు.. అయితే ఎఫ్ డీఐ లు ద్వారా డాలర్లు రావడములేదా? ప్రైవేటుగా అంతర్జాతీయ సంస్థలవద్దనుండి అప్పుచెయ్యడములేదా? ఉదాహరణకు అహ్మదాబాద్ మెట్రోకొరకు 100000 కోట్లు జపాన్ వద్దనుంచి అప్పుచెయ్యడములేదా? వివిధ ప్రాజక్ట్ లకొరకు రాష్ట్రాలు అప్పుతేవడములేదా? వివిధ రాష్ట్రాలు తెస్తున్న అప్పులు తమవి కాదన్నట్లు చెప్పడమువలన కేంద్రము అప్పుచెయ్యడములేదు అన్నట్లు కనిపిస్తుందేకాని అన్ని అప్పులూ మమూలుగా చేస్తూనే ఉన్నారు.
ఇక మన కేంద్ర ప్రభుత్వము తనకు తానుగా వరల్డ్ బ్యాంకు అప్పుచెయ్యకపోవడానికి కారణము క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడము ఒక ఎత్తు అయితే పెట్రోల్ డీజల్ లపై పన్నులు అధికాధికంగా వసూలుచెయ్యడము రెండో కారణము అవుతుంది. 2014 సం పూర్వస్థితిలోకి వెళితే 2011-12 లలో సంవత్సరమునకు ఒకటికి 910000 కోట్లు క్రూడ్ ఆయిల్ బిల్లు కేంద్రము భరించేది. ఈ బిల్లు 2014-15 కు రు. 687000 కోట్లకు తగ్గినది. అలా ఆ సంవత్సరములో 2,23,000 కోట్లు కలిసివచ్చినది. తరువాతి సం బిల్లు 4,18,000 కోట్లకు పడిపోయినది. 2016-17 సం కీ ఈ బిల్లు 4,70,000 కోట్లు. 2017-18 బిల్లు5,65,000 కోట్లు. అలా ఈ నాలుగు సంవత్సరములలో మనకు అనగా కేంద్రమునకు సంవత్సరమునకు 3,75,000 కోట్లు మొత్తానికి 15,00,000 కోట్లు క్రూడ్ ఆయిల్ బిల్లు భరించాల్సిన అవసరము లేకుండా పోయింది. (అయితే ఒక విషయము మనము గుర్తుంచుకోవాలి, గత ఎనిమిది సంవత్సరములలో క్రూడ్ ఆయిల దిగుమతి విలువలలో మార్పు వచ్చిందేగాని ఆయిల్ పరిమాణము నిలకడగానే ఉంది. సంవత్సరానికి 180 నుంచి 200 మిల్లియను మెట్రిక్ టన్నులు క్రూడ్ ఆయిల్ దిగుమతి జరుగుతూనే వస్తుంది.) ఈ కలిసి వచ్చిన సొమ్ము పెరిగిన ఎలక్టానిక్ మెకానికల్ వస్తువుల దిగుమతికి ఉపయోగపడుతూవస్తుంది. అలానే యుద్ధ పరికరాల కొనుగోలుకు కూడా ఉపయోగపడినది. అలాగే మనదేశముతిరిగి చెల్లించాల్సిన అప్పులు తిరిగి కట్టడానికి దిగుమతుల బిల్లుల అవసరాలకు భారీగా ఉపయోగ పడినది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంటు అనే విదేశీ పెట్టుబడులు 2014-17 మధ్యలో షుమారు రు. 740000 కోట్లు వచ్చిపడినవి. ఇదే 2010-14 ప్రాంతములో 650000 కోట్లు వచ్చినవి. అయితే విచారించవలసిన విషయమేమిటంటే కేంద్రానికి ఇంత కలిసివచ్చినాకూడా అదనపు ఆదాయముకొరకు ఈ నాలుగు సంవత్సరములూ ఒక క్రమపధ్ధతిలో ఎక్సైజు డ్యూటీ పెంచుకుంటూ పన్నుల రూపములో షుమారు 3,50,000 కోట్లు గడించింది. అసలు ప్రభుత్వం అన్యాయంగా విధించే పన్నులను రద్దుచెయ్యమని ప్రజలతరపున ప్రాతినిధ్యము వహించే పార్లమెంటు సభ్యులు అడగాలి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగడము మొదలుపెట్టినవి. తద్వారా దేశ ఆర్ధిక పరిస్థితి ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశముఉంది. ఇకనుంచి దేశ ఆర్ధిక వ్యవస్థ, పురోగతి అంశములలో తిరోగమనము తప్పదు. అపుడు కేంద్రము క్రూడ్ ఆయిల్ బిల్లు గురించి చెప్పుకొచ్చి తమ తప్పులేదు అనవచ్చు. అదే విధానములో గత నాలుగు సంవత్సరములుగా క్రూడ్ ఆయిల్ బిల్లు తగ్గడమువలన దేశ ఆర్ధిక పరిస్థితి కుదుటపడినదని చెబుతుందా?!. Click the following buttons to visit my other Websites:
నా ఇతర వెబ్ సైట్లు చూడడానికి ఈ క్రింది బటనులు నొక్కవలెను. |
Click on the following links to view my You Tube videos on the issue of,
Saraswati river still flows, all Parts 1 to 9, full length video However you can also view individual videos in parts by clicking on the following links(2) Part 2, Aryanism a myth and a hoax (3) Part 3, Harappa, rivers of Indus valley (4) Part 4. Ghaggar cannot be river Saraswati (5) Part 5, Brahmavartam, Priest King, Pasupati shiva (6) Part 6, Seven Saraswati rivers.. (7) Part 7, sindh is saraswati And offer your comments/suggestions |